contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గిరిజనుల భూములు కబ్జా … 1/70 చట్టానికి తూట్లు

  • గిరిజనుల భూములు గిరిజనేతరుల పరం
  • హుకుంపేట చుట్టూ కబ్జాకోరుల దందా
  • అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోని అధికారులు
  • గిరిజనులు బినామీలుగా మరడమే ప్రధాన కారణం

హుకుంపేట :అడవుల్లో ఆదివాసీలకే ఆస్తి హక్కు ఉండాలన్న నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఐదో షెడ్యూల్లో చేర్చి తెచ్చిన 1/70 చట్టానికి కొందరు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడం, అంతరించి పోతున్న తెగలను కాపాడలనే లక్ష్యంతో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆదివాసీలకు రక్షణ కల్పించడం మాట అటుంచి గిరిజనేతరులకు మాత్రం కాసుల పంట పండిస్తోంది. ఇదంతా అధికార యంత్రాంగం ఎదుటే జరుగుతున్నా ఏనాడు అడ్డుకున్న పాపనపోలేదని గిరిజనులు వాపోతున్నారు. అంతేకాదు కొంతమంది గిరిజన నాయకుల బినామీ అవతారం ఎత్తి అక్రమార్కులతో లాలుచి వ్యవహరం నడుపుతుండడంతో హుకుంపేట మండలంలో పశువుల ఆసుపత్రి పక్కన (అలీ మహమ్మద్ ) అనే తమిళ్ నాడు కి చెందిన వ్యక్తి రెండు అంతస్థుల అక్రమ నిర్మాణం పునాది వేసినప్పుడు గిరిజన సంఘం పత్రిక ద్వారా ప్రకటన ఇచ్చినప్పుడు రెవిన్యూ అధికారులు వెళ్లి నిర్మాణం ఆపండి అని చెప్పి వారం గడవక ముందే ఆదివారం నాడు స్లప్ వేశారు. రెవిన్యూ అధికారులే సెలువు రోజు వేయండి అని చెప్పారని అప్పుడు గిరిజన సంఘం కృష్ణారావు ఆరోపించారు. అయినప్పటికీ పూర్తి స్థాయి లో నిర్మాణం చెపడుతున్నారని తెలిసి వందలాది మంది గిరిజనులు ఆ నిర్మాణాని గుణపములతో పొడిచి గోడలను పడగొట్టారు. అయినప్పటి ఇపుడు చూస్తే పూర్తి స్థాయిలో ప్లాస్టింగ్లు కూడా అయిపోతున్నాయిి. రెవిన్యూ అధికారు చేపడుతున్న చర్యలు తూతుమంత్రంగా ఉన్నాయని అర్ధం అవుతుంది. అంత ఉద్రిక్తత తో చేసిన ఉద్యమ ఇపుడు కనుమరుగు అవుతుండటంతో అఖిల పక్షం నాయకులు కాసులు కక్కుర్తి పడి ఉద్యమాన్ని కొనసాగించలేదని తమిళనాడు కు చెందిన వ్యక్తులు హుకుంపేట లో ఉన్న నాయకులను అధికారులను గాని అధికారులు మెజార్జీ భూ కమతాలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ప్రభుత్వం పట్టాలు ఇచ్చినా బలమున్నోడిదే రాజ్యం అన్నట్లుగా అమాయక ఆదివాసీలను రుణాల పేరుతో ట్రాప్‌ చేసి కోట్లాది రుపాయల విలువైన భూములను సొంతం చేసుకుటున్నారు. అనంతరం దర్జాగా క్రయవిక్రయాలు జరుపుతూ రెండు చేతులా ఆర్జిస్తున్న పరిస్థితి హుకుంపేట షరా మాములుగా తయారైంది.
అవినీతి అదికారులదే కీలక పాత్ర.కీలకం అని చెప్పొచ్చు
చట్టాలను రక్షించాల్సిన అధికార యంత్రాగమే భూ భకాసూరుల కొమ్ము కాస్తూ మామూళ్ల మత్తుతో తూలడమే కాకుండా ఏకంగా నిజాం కాలం నాటి నక్షాలనే సమూలంగా మార్చి వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టిన అనంతరం జిల్లాల పరిమాణం తగ్గడంతో పాటు భూములకు ఒక్క సారిగా రెక్కలు వచ్చాయి. దీంతో ఏజెన్సీ భూములతో పాటు ప్రభుత్వ భూములపైన కబ్జా కోర్‌ల కన్ను పడింది. ఈ మేరకు కొన్ని చోట్ల ఏకంగా సర్వే నంబర్లనే తారు మారు చేస్తూ వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు బలపడుతున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :