భారత జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పక్షపాత వైఖరిని ఖండిస్తూ.. బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి పిలుపుమేరకు.. పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు.. బిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో.. పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించాయి. ఐటి, ఈడి, సిబిఐ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రతిపక్ష పార్టీలను అణచివేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వారు విమర్శించారు. అక్రమ కేసులను ఎత్తివేసేంతవరకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు.