సిద్దిపేట జిల్లా: ది రిపోర్టర్ టివి: బెజ్జంకి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రతిపక్షాలు బుధవారం తలపెట్టిన “బెజ్జంకి మండల బంద్” పై మాట్లాడుతూ అనవసర రాద్ధాంతం చేసి ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మంగళవారం బెజ్జంకి మండల కేంద్రంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ మరియు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిని పెల్లి వినోద్ కుమార్ బెజ్జంకి క్రాసింగ్ నుండి మండల కేంద్రం బెజ్జంకి కి బైక్ ర్యాలీ ద్వారా వస్తున్న తరుణంలో కొందరు బీఎస్పీ కార్యకర్తలు “గో బ్యాక్ గో బ్యాక్ “అంటూ కాన్వాయిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మా బి ఆర్ ఎస్ కార్యకర్తలు పక్కకు జరగమని మర్యాదపూర్వకంగా పోలీసుల సమక్షంలో సర్ది చెప్పే ప్రయత్నం చేశారు, వారిపై ఎలాంటి దాడి చేయలేదు మీకు ఏదైనా సమస్య ఉంటే వినతి పత్రం ఇవ్వమని చెప్పినాము కానీ బీఎస్పీ కార్యకర్తలే మా నాయకుని పై అనుచిత వ్యాఖ్యలు చేశారు, ఇలాంటి అనుచిత వాక్యాలు అర్థరహిత ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు, మా ఎమ్మెల్యే వారంలో ఆరు రోజులు బెజ్జంకి ప్రజలకు అందుబాటులో ఉంటారని అలాంటి వ్యక్తిపై అర్థరహిత ఆరోపణలు మానుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు రాష్ట్ర నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, చింతకింది శ్రీనివాస్ గుప్తా, ఎలుక దేవయ్య, బోనగిరి శ్రీనివాస్, గుబురే మల్లేశం, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎలా శేఖర్ బాబు, బిగుళ్ల సుదర్శన్, రవియాదవ్, రమేష్,మొండయ్య,వంగ నరేష్,లింగాల బాబు,తదితరులు పాల్గొన్నారు.