జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన రైతు పిట్ల లింగం ఇటీవల ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబ సభ్యులను బి.ఆర్.ఎస్ నేతలు పరపరసించారు.
రుణమాఫీ కాక, రైతు భరోసా డబ్బులు రాక, వ్యవసాయానికి చేసిన అప్పులు తీరక అనేకమంది రైతులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన రైతు పిట్ల లింగం ఇటీవల ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబ సభ్యులను బి.ఆర్.ఎస్ పార్టీ కి చెందిన రైతు ఆత్మహత్యల కమిటీ సభ్యులు మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ కుమార్, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, రసమయి బాల కిషన్, తదితరులు పిట్ల లింగం కుటుంబాన్ని పరామర్శించారు. పిట్ల లింగం కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని రానున్న రోజుల్లో వారి పిల్లలకు, కుటుంబానికి అండగా ఉంటామని 1లక్ష రూపాయలు తక్షణ సహాయం ఇస్తామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రోజుకు ఒక రైతు చొప్పున 400 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. రైతులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేక రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారని, రైతు భరోసా అమలు చేయక, రుణమాఫీ సక్రమంగా జరుగక, చేసిన అప్పులు పెరిగి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధుకు మరియు పంటల కొనుగోలుకు, పెట్టుబడికి, సాగునీరుకు ఏలాంటి ఇబ్బంది లేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. రైతులకు భరోసా అయితే నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రాష్ట్రంలోని ముఖ్యమంత్రి , మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అధికారంలో ఉండి ఏం చేస్తున్నారని విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భవిష్యత్తులో స్సహాయ సహకారాలు అవసరం ఉన్న అండగా ఉంటామని తెలిపారు