కరీంనగర్ జిల్లా: ఫిబ్రవరి 5వ తేదీ రోజు శ్రీ లక్ష్మి నరసింహ గార్డెన్ అల్గునూర్ లో జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, కరీంనగర్ ఎమ్మల్యే గంగుల కమలాకర్,మరియు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లు హాజరవుతున్నారని. ఈ కార్యక్రమానికి గన్నేరువరం మండల పరిధిలోని ఎంపీటీసీ సభ్యులు, తాజా మాజీ సర్పంచ్ లు, మాజీ ఉప సర్పంచ్ మాజీ వార్డు సభ్యులు,మాజీ రైతు సమితి సభ్యులు,బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు,అయా గ్రామాల బీ.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు, యువ నాయకులు,భారసా మహిళ విభాగం నాయకులు , మరియు పార్టీ నాయకులు రావాలని ఒక ప్రకటన లో కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు న్యాత సుధాకర్, లక్ష్మణ్,మొండయ్య, తదితరులు పాల్గొన్నారు.