సిద్దిపేట జిల్లా : ది రిపోర్టర్ టీవీ :బెజ్జంకి మండల కేంద్రం నుండి బేగంపేట గ్రామం వరకు బుధవారం గత కొంతకాలంగా రోడ్డు లేక మండల కేంద్రానికి రావడానికి ఇబ్బంది పడుతున్న ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 9 కోట్ల రూపాయల తో బీటి రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు రోడ్డును పరిశీలిస్తూ, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు నిర్మాణానికి సహకరించిన రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు, మానకొండూరు ఎమ్మెల్యే రాష్ట్ర సంస్కృతిక సారధి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్, స్థానిక ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్, జడ్పిటిసి కనగండ్ల కవిత తిరుపతి కీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పాకాల మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ
సీఎం కేసీఆర్ పాలనలో రోడ్లకు మహర్దశ పట్టిందని, బీఆర్ఎస్ తోనే అభివృద్ది సాధ్యం అని, గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి జరిగిందని, సీఎం కేసీఆర్ అధ్వర్యంలో జరుగుతున్న అభవృద్ధిపై ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణ వైపు చూస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్,రాష్ట్ర నాయకులు చింతకింది శ్రీనివాస్ గుప్తా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చు రాజయ్య, గుబిరే మల్లేశం, కుసుంబ పవన్ సోషల్ మీడియా ఇంచార్జ్ ఎలా శేఖర్ బాబు, బోనగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.