బీఆర్ఎస్ కు డబుల్ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో చేవెళ్ల బీఆరెస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దానం నాగేందర్ కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేవెళ్ల సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డికి సైతం కాంగ్రెస్ అధిష్టానం చేవెళ్ల ఎంపీ టికెట్ ఆఫర్ చేసిందని ప్రచారం జరుగుతోంది.