సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండలంలో దాచారం గ్రామంలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు బుధవారం రైతు వేదికలలో కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా బి ఆర్ ఎస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే రాష్ట్ర సంస్కృతిక సారధి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, వ్యవసాయ రంగానికి 3 గంటల విద్యుత్ సరిపోతుందని తప్పుడు ప్రకటనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రైతుల చేతిలో పతనం తప్పదని హెచ్చరించరు. ఈ సందర్బంగా రసమయి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు కాంగ్రెస్ పాలనలో రైతులు కరెంటు కోతలతో సాగు చేసిన పంటలన్ని కళ్ళ ముందే ఎండిపోతుంటే చూడలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో చూశామన్నారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీమాంధ్ర చంద్రబాబు డైరెక్షన్లో పని చేస్తున్నారని మూడు గంటల
కరెంటు ఇస్తే వ్యవసాయానికి సరిపోతుందని రేవంత్ రెడ్డి మతిభ్రమించిన మాటలు మాట్లాడుతున్నారని రసమయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెంటమీది,శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ లింగాల నిర్మాణా లక్ష్మణ్, జడ్పిటిసి కవిత తిరుపతి, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చు చంద్రకళ రాజయ్య, రైతు సమన్వయ కమిటీ మండల చైర్మన్ ఒంటెల సంపత్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ జిల్లా సభ్యులు ఐల పాపయ్య, బి ఆర్ ఎస్ పార్టీ మండల చేరికల కమిటీ ఇంచార్జ్ చింతకింది శ్రీనివాస్ గుప్తా, పార్టీ అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్, సోషల్ మీడియా ఇంచార్జ్ ఎలా శేఖర్ బాబు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వివిధ గ్రామాల రైతులు, బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.