ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఏ మాత్రం అభివృద్ధి లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరెంటు, నీళ్లు లేక ప్రజలు, రైతులు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పారు. కరెంటు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవారని… కరవు కారణంగా చాలా మంది రైతులు పొట్టకూటి కోసం దుబాయ్ కి వలసపోయారని చెప్పారు. సమైక్య పాలనలో తెలంగాణ సంపదను దోచుకుపోయారని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో కరెంట్ కోతలే లేవని చెప్పారు. బొమ్మనకల్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం సుభిక్షంగా మారిందని గంగుల చెప్పారు. కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. అభివృద్ధి చెందిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసిన ఢిల్లీ పార్టీలను తరిమేయాలని ఓటర్లకు విన్నవించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు.