కరీంనగర్ జిల్లా: గన్నేరువరం బిఆర్ఎస్ యూత్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా మండలంలోని చాకలివాని పల్లె గ్రామ పరిధిలోని కూనవానిపల్లి చెందిన కూన చంద్రశేఖర్ నియామకం అయ్యారు, ఈ మేరకు మానకొండూరు నియోజవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా తన నియమకానికి కృషి చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి,జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డికి, వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్ కి,బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న కి, బిఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.