- అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి
- మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ పిలుపు
కరీంనగర్ జిల్లా: మానకొండూర్ నియోజకవర్గం: తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని శ్రీ.సాయిరాం ఫంక్షన్ హాల్లో .. ఈనెల 20 న, ఉదయం: 10.00 గంటలకు బీ.ఆర్.ఎస్.పార్టీ తిమ్మాపూర్ మండలం స్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాంస్కతిక సారథి చైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ తెలిపారు. ఈరోజు సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో తిమ్మాపూర్ మండలంలోని ప్రజాప్రతినిధులు మరియు ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరియు బీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మానకొండూర్ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. కార్యకర్తలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ఎప్పుడూ ఎవరికి ఏ ఆపద వచ్చినా అండగా వుండడమే కాకుండా కంటికి రెప్పలా కాపాడుకోవడం జరుగుతుందని చెప్పారు. తిమ్మాపూర్ మండలస్థాయి ఆత్మీయ సమ్మేళన వేడుకలకు అన్ని గ్రామాల నుండి బీ.ఆర్.ఎస్. పార్టీ కుటుంబ సభ్యులైన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు మరియు అన్ని అనుబంధ సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. అనంతరం సభా నిర్వహణ ఏర్పాట్ల కోసం కొత్తపల్లిలోని శ్రీ. సాయిరాం ఫంక్షన్ హాల్ ను పరిశీలించారు..