- ప్రమాదాల్లో మృతి చెందిన ఇద్దరు కార్యకర్తల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
బొల్లారం: బిఆర్ఎస్ పార్టీకి వెన్నుముకగా నిలుస్తున్న కార్యకర్తలను అనునిత్యం అండగా నిలుస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
బొల్లారం మున్సిపాలిటీకి చెందిన చబ్బిలాల్ ఇటీవల ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడికి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో.. పార్టీ తరఫున రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా మంజూరు అయింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో మృతి భార్య శారదకు ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా బిఆర్ఎస్ పార్టీలో పని చేసే ప్రతి కార్యకర్తకు రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని అన్నారు. కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.