సంగారెడ్డి – అమీన్ పూర్ : భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా నిన్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు, బీరంగూడ ప్రాంతాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పార్టీ జెండాలను ఎగురవేశారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరి పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటుచేసిన ప్రతినిధుల మహాసభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో.. స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సహాయ సహకారాలతో మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బాల్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.