సంగారెడ్డి అమీన్పూర్: భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం పటాన్చెరులో ఏర్పాటుచేసిన నియోజకవర్గ ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కోరారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. మున్సిపల్ పరిధిలోని 24 వార్డులలో మంగళవారం ఉదయం 8 గంటలకు పార్టీ జెండాలను ఆవిష్కరించి, అనంతరం అమీన్పూర్ పెద్ద చెరువు నుండి బీరంగూడ కమాన్ మీదుగా పటాన్చెరు వరకు భారీ బైక్ ర్యాలీతో సమావేశానికి హాజరు కావడం జరుగుతుందని తెలిపారు. ప్రతి వార్డులో నిర్వహించనున్న జెండా పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించాలని కోరారు. మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను గడపగడపకు వివరించనన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహా గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు కోపం సభ్యులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
