కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మీసాల ప్రభాకర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మరియు సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు, కేక్ కట్ చేసి సీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గన్నేరువరం ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, సీనియర్ నాయకులు న్యాత సుధాకర్, జంగపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు మహంకాళి ప్రభాకర్,బీఆర్ఎస్ నాయకులు తెల్ల భాస్కర్,కొట్టే భూమయ్య, పుల్లెల మల్లయ్య, రామంచ ఈదయ్య, బుర్ర కృష్ణ, శంకర్, కిట్టు,నవీన్,తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.