- మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్
- రేగులపల్లిలో ప్రజా ఆశీర్వాద సభ
- కాంగ్రేస్, బీజేపీ లకు చెందిన వంద మంది బీఆర్ఎస్ లో చేరిక
- ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది
- ప్రజానేత రసమయికు ప్రజల నీరాజనం
- బొట్టుపెట్టి, మంగళహారతులు పట్టిన ఆడబిడ్డలు
- జనసంద్రంగా రేగులపల్లి
కరీంనగర్ జిల్లా: ప్రజాభీష్టానికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బీ.ఆర్.ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారని, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయిన కాంగ్రెస్ కు పార్టీలకు ప్రజాక్షేత్రంలో ప్రజలే తగిన గుణపాఠం చెపుతారని, మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. బెజ్జంకి మండలం లోని రేగులపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. రేగులపల్లి గ్రామ ఆడబిడ్డలు, ప్రజలు బతుకమ్మలు, బోనాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచేలా ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోను రూపొందించారని అన్నారు.రేగులపల్లి గ్రామంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన వంద మంది బీఆర్ఎస్ లో చేరగా గౌరవ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలోని 90 లక్షల కుటుంబాలకు ధీమా కల్పించేలా అయిదు లక్షల రూపాయల జీవిత బీమా అందించనున్నారని, అదేవిధంగా సౌభాగ్య మహిళా పథకం కింద అర్హులైన మహిళలకు మూడు వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించేలా హామీ ఇచ్చారన్నారు. 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అగ్రవర్ణ పేదల కోసం రెసిడెన్షియల్ స్కూల్ లు, దశల వారిగా అయిదు వేల రూపాయల ఆసరా పెన్షన్ల అందచేత, రైతు బంధు ఆర్ధిక సహాయాన్ని 16 వేలకు పెంచడం, ఆరోగ్య శ్రీ కింద పదిహేను లక్షలకు గరిష్ట పరిమితి పెంపు వంటి ప్రజా శ్రేయస్సు కోరే హామీలను మేనిఫెస్టో లో పొందుపర్చారని అన్నారు. దివ్యాంగులకు సైతం 6016 రూపాయలకు పెన్షన్ ను పెంచే విధంగా హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
మానవీయ కోణంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలుస్తోందని స్పష్టం చేశారు. మేనిఫెస్టో పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమన్నారు. కర్ణాటకలో బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమయిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. యువనిధి, ఉచిత రేషన్, డిప్లొమా చేసిన వారికి భ్రుతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమయిందని మండిపడ్డారు. అటు బీజేపీ సైతం ఇచ్చిన హామీలను బుట్టదాఖలు చేసిందని గుర్తు చేశారు. ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్, రైతులకు ఆదాయం రెట్టింపు హామీలను బీజేపీ పూర్తిగా విస్మరించిందని అన్నారు.. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని స్పష్టం చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.
మానకొండూర్ నియోజకవర్గాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి చేశానని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఏ ఆపద వచ్చిన అండగా ఉంటున్నానని అన్నారు. కాంగ్రెస్ బిచ్చగాళ్లు చెప్పే మాయమాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దని, దొంగ హామీలతో ఎన్నికలు వస్తేనే ఊర్లలోకి అచ్చే పగటి వేశగాళ్ళు కాంగ్రెస్ నాయకులని అన్నారు. ఈ దొంగల మాటలు నమ్మొద్దన్నారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు నీళ్లు లేక పరాయి దేశాలు, పొరుగు రాష్ట్రాలకు వలస పోయిన రైతులు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను వలస తెస్తున్నారని పేర్కొన్నారు. గృహాలక్ష్మి పథకం ద్వారా ఇంటిస్థలం ఉన్న ప్రతి ఒక్కరికీ రూ. మూడు లక్షల సాయం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.