మెదక్ జిల్లా నియోజకవర్గంలోని,పిసిసి సభ్యులు సుప్రభాత రావు,పిసిసి అధికార ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్ యువకులు రామాయంపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన సుమారు 20 మంది యువకులు శనివారం నాడు పిసిసి సభ్యులు సుప్రభాత్ రావు,పిసిసి అధికార ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం వీరందరికీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించి వచ్చే వంద రోజులు కష్టపడి పని చేయాలని మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని యువకులను కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, రామాయంపేట పట్టణ మాజీ అధ్యక్షులు డాకిస్వామి, కాంగ్రెస్ పార్టీ రామాయంపేట పట్టణ వైస్ ప్రెసిడెంట్ అల్లాడి వెంకటేష్, రామాయంపేట పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డాకి నాగేందర్, నార్లాపూర్ గ్రామానికి చెందిన సాయి కుమార్ రెడ్డి రాకేష్ యాదవ్ కరుణాకర్ రోహిత్ నిఖిల్ రాజేష్ భూపాల్ రోషన్ హరీష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.