కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో మండలంలోని గుండ్లపల్లి,గునుకుల కొండాపూర్,చీమలకుంటపల్లి లో బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, గ్రామ బూత్ ఇంఛార్జి లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. గోదావరి జలాలతో గన్నేరువరం మండలం సస్యశ్యామలం అయ్యిందని, వేల ఎకరాల్లో సాగు పెరిగిందని, అనేక సంక్షేమ పథకాలు మండల వ్యాప్తంగా ప్రతీ ఇంటికీ అందజేస్తున్నమని, రైతు బంధు,రైతు బీమా,విదేశీ విద్య,కళ్యాణ లక్ష్మీ,సీసి రోడ్లు, కమ్యూనిటీ హాల్ ల నిర్మాణాలు,అసరా పెన్షన్లు, ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విధానం ప్రజల ముందు ఉన్నదని అన్ని వర్గాల సంక్షేమమే సీయం కేసీఆర్,ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు తీగల మోహన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు, చీమలకుంటపల్లి సర్పంచ్ కర్ర రేఖ కొమురయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లేశం, కో ఆప్షన్ సభ్యులు రఫీ, బీసీ సెల్ మండల అధ్యక్షుడు చింతల రవి,గ్రామ శాఖ అధ్యక్షులు తాల్లపల్లి అనిల్,న్యాలపట్ల శంకర్,బామండ్ల తిరుపతి బిఆర్ఎస్ ముఖ్య నాయకులు ఇన్చార్జిలు పాల్గొన్నారు.
