అల్లూరి సీతారామరాజు జిల్లా: ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు భారీ డంప్ స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు ఈ డంపులో భారీ ఎత్తున పేలుడు సామాగ్రి ఆయుధాలు ఉన్నట్లు బిఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి ఏఓబి లోని మల్కనగిరి జిల్లా కలిమల పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం రావడంతో బెజ్జింగివాడ ప్రాంతంలో బిఎస్ఎఫ్ఎల్ బలగాలు గాలింపు నిర్వహించారు. బెజ్జింగ్ వాడ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో అమ్ఫాదర్, ఎలకనూరు, బొడ్లిగూడ బురదమామిడి గ్రామాలను ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో మావోయిస్టు దాచి ఉంచిన డంపును బిఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డంపులో భారీ ఎత్తున పేలుడు మరియు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో 303 తుపాకీ, ఎస్బి ఎంఎల్ బ్యారెల్స్ 11, హ్యాండ్ గ్రైనేడ్లు 15, దేశీయ రాకెట్ లాంచర్ ఒకటి, 51mm మోటర్ బాంబు 1, ఎలక్ట్రికల్ డిటెనేటర్లు 30 స్వాధీనం చేసుకున్నట్లు బిఎస్ఎఫ్ అధికారులు తెలిపారు .