- బిజెపి పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్న ఏకైక వ్యక్తి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అని,
- పార్టీని అన్ని విధాల భ్రష్టు పట్టిస్తున్నాడని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గొర్లపల్లి వర ప్రసాద్ ఆరోపించారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ బెల్లంపల్లి, చెన్నూర్, ధర్మపురి నియోజకవర్గాల ఏలుదామని ఉద్దేశంతో పేటీఎం బ్యాచ్, పేడ్ లీడర్లను వెంటబెట్టుకొని పార్టీలో మిగతా వారిని ఎదగకుండా మాజీ ఎంపీ వ్యవహరిస్తాడని అందుకే తాము బిజెపి పార్టీని వీడి బీఎస్పీలో చేరినట్లు తెలిపారు. 2018 ఎన్నికల్లో గడ్డం వినోద్ వెంకటస్వామి బీఎస్పి తరఫున బెల్లంపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా నియోజకవర్గ ప్రజలు 40, 000 ఓట్లు వేసి ఆదరిస్తే ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పటివరకు నాలుగు, ఐదు సార్లు మాత్రమే నియోజకవర్గంలో వినోద్ పర్యటించారన్నారు. ఇలాంటి వ్యక్తులను నమ్మి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు మోసపోవద్దని తెలిపారు. మాజీ ఎంపీ వెంట ఉండే నియోజకవర్గం బిజెపి నాయకులు భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఆ పదాలను అపవిత్రం చేస్తున్నారన్నారు. ఆ పదాలు పలికే అర్హత కూడా వారికి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బిఎస్పి పార్టీ గెలిచే సీట్ల సంఖ్యను కూడ బిజెపి గెలవలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బహుజనులకు న్యాయం జరగాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలని వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ జెండా ఎగుర వేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొర్ల పల్లి వరప్రసాద్, (నియోజకవర్గ ఇంచార్జ్), జశ్వంత్,(బి ఎస్ పి.కన్వీనర్),సాగర్(సోషల్ మీడియా కన్వీనర్),ప్రశాంత్,పాల్గొన్నారు