- కర్నూలు పార్లమెంట్ తో పాటు ఎమ్మిగనూరు నియోజకవర్గం అసెంబ్లీ సీటు కూడా బీసీలకే కేటాయిస్తాం
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి వెల్లడి
ఎమ్మిగనూరు : బీసీలకు అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాలలో జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బహుజన సమాజ్ పార్టీ బీసీలకు పెద్దపేట వేస్తుందని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి గారూ పేర్కొన్నారు ఆదివారం స్థానిక మున్సిపల్ ఓపెన్ థియేటర్ నందు బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు జై రాజ్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రన్న మరియు బిజీ చంద్రన్న ల అధ్యక్షతన జరిగిన బీసీ గర్జన బహిరంగ సభ లో బిఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్లు బాలయ్య మరియు ఆర్.జె.మల్లికల్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంచాల లక్ష్మీనారాయణలతో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాబోయే 2024 ఎన్నికలలో 175 అసెంబ్లీ స్థానాలలో బీఎస్పీ పార్టీ 100 స్థానాలను బీసీలకే కేటాయించి ప్రజలు ఆశీర్వదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తే బీసీలకే ముఖ్యమంత్రి పదవి ని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు
ఎమ్మిగనూరు నియోజకవర్గం అసెంబ్లీ సీటును బీసీలకు కేటాయిస్తాం:
ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం అసెంబ్లీకి 2024 అసెంబ్లీ టికెట్ బీసీలకే కేటాయిస్తామని రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి పేర్కొన్నారు
బీఎస్పీ జిల్లా కార్యదర్శి గా మరియు ఎమ్మిగనూరు అసెంబ్లీ కన్వీనర్ గా బోయ గుడిసె చంద్రన్న ఎంపిక
ఇటీవల బీఎస్పీ పార్టీలో చేరిన మాజీ తెలుగుదేశం సీనియర్ నాయకులు కే తిమ్మాపురం కు చెందిన బోయ గుడిసె చంద్రన్న ను బీఎస్పీ కర్నూలు జిల్లా కార్యదర్శిగా మరియు ఎమ్మిగనూరు అసెంబ్లీ కన్వీనర్ గా ఎంపిక చేస్తున్నట్లు బీసీ గర్జన సభలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి సమక్షంలో బిఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ జె మల్లికల్ మరియు రాష్ట్ర కోఆర్డినేటర్ బాలయ్య గారు ప్రకటించారు ఈ కార్యక్రమంలో బిఎస్పి జిల్లా ఇన్చార్జ్ అరుణ్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు సామేలు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ బోయ రవి కుమార జిల్లా కోశాధికారి సలీం బీఎస్పీ సీనియర్ నాయకులు రెడ్డిపోగు డేవిడ్ గారు, ఎమ్మిగనూరు అసెంబ్లీ అధ్యక్షులు ఏ నాగరాజు, మంత్రాలయం అసెంబ్లీ అధ్యక్షులు మోహన్ కుమార్, ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు రామలింగయ్యా, కర్నూలు అసెంబ్లీ అధ్యక్షులు మధు, పత్తికొండ అసెంబ్లీ అధ్యక్షులు మధుశేఖర్, ఆదోని అసెంబ్లీ అద్యక్షులు ప్రేమ్ కుమార్, అన్ని నియోజకవర్గ ఇంచార్జ్ లు, తాలూకా నాయకులు, మండల కమిటీ నాయకులు, బూత్ లెవల్, సెక్టార్ లెవల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.