సిద్దిపేట జిల్లా: ది రిపోర్టర్ టీవీ : బి ఆర్ ఎస్ పార్టీ ప్రకటించిన శాసనసభ స్థానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కురుమ యాదవ కమ్యూనిటీ సొసైటీ సిద్దిపేట జిల్లా గౌరవ అధ్యక్షుడు పెద్దోళ్ల శ్రీనివాస్ కురుమ, గురువారం బెజ్జంకి మండల కేంద్రంలో విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ దేశ జనాభాలో 60% పై ఉన్న బీసీలకు బిఆర్ఎస్ పార్టీ సీట్ల కేటాయింపులో అన్యాయం చేసిందని, బీసీలను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటూ బీసీ బందు పేరుతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు, బీసీలలో రాజకీయ చైతన్యం రావాలని రాజ్యాధికారం బీసీలకు రావాలని వచ్చే శాసనసభ ఎన్నికలలో బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలకు సరైన బుద్ధి చెబుతూ రాజకీయ అవగాహనతో ఆచితూచి ముందుకెళ్లాలని సూచించారు, బీసీ వర్గం లో ఉన్నటువంటి కురుమ సామాజిక వర్గానికి శాసనసభ స్థానాలలో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం బాధాకరమనిపేర్కొన్నారు.బహుజన రాజ్యం రావాలంటే బీఎస్పీ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని, తెలంగాణ బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే రానున్న శాసనసభ ఎన్నికలలో రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న బీసీ వర్గాలకు 60 సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అని పేర్కొంటూ బహుజన రాజ్యం కోసం జనాభాలో అధిక శాతంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు సంఘటితంగా ముందుకెళ్లాలని సూచించారు.
