- గ్రూప్ వన్ పరీక్ష పత్రాల లీకేజీ పై సిట్టింగ్ జర్జిచే విచారణ జరపాలి
- బీఎస్పీ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన దీక్ష
సంగారెడ్డి : బహుజన్ సమాజ్ పార్టీ (బి.ఎస్.పి.) ఆధ్వర్యంలో నేడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిరుద్యోగుల భరోస దీక్ష జరిగింది. ఈ దీక్ష కార్యక్రమానికి హాజరైన బి.ఎస్.పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కెసిఆర్ ప్రభుత్వం కూల్చడం కచ్చితంగా జరుగుతుందిని, ప్రజా జీవితాలను అఘాధంలోకి నెట్టేస్తే బీఎస్పీ చూస్తూ ఊరుకోదన్నరు. నిన్నటిదాకా తెలంగాణ రాష్ట్ర ప్రజలను దోచుకున్నది చాలని, తెలంగాణ ప్రజల జీవితాలతో ఆటలాడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామని, రాబోయే ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆయన అవినీతిని అస్త్రంగా ప్రజల్లోకి వెళ్తామని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేల్కొని సరైన పాలకులను రాబోయే ఎన్నికలలో ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కేవలం ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ ద్వారా మాత్రమే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బి.ఎస్.పి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం నాయిని ఈశ్వర్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నటరాజ్, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు వినోద్, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు అలెక్స్, నారాయణఖేడ్ నియోజకవర్గం అధ్యక్షులు అలిగే జీవన్, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీధర్, అందోల్ నియోజకవర్గం అధ్యక్షులు పి మోహన్, సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు, ఆఫీస్ బేరర్లు తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.