- బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి & కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జి జక్కని సంజయ్ కుమార్.
సిద్దిపేట జిల్లా :ది రిపోర్టర్ టీవీ :బెజ్జంకి మండల కేంద్రములో మంగళవారం ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి & కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జి జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గడిచిన 9 ఎండ్ల పాలనలో చేసింది ఏమీ లేకున్నా కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తూ,నేడు అదే అభివృద్ధి అని చెప్పుకుంటూ మానకొండూర్ నియోజకవర్గ ప్రజలను మభ్య పెడుతూ మరోసారి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్న రసమయ బాలకిషన్ నీకు ఎమ్మెల్యే గా ఉండే అర్హత లేదు. కేవలం మీ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళితబంధు, బిసి బందు అని బందుల పేరిట బిఆర్ఎస్ నాయకులు కమిషన్లు దండుకొనే పథకమే తప్ప మరేమీ కాదు కొత్త రేషన్ కార్డులు లేవు, దళిత బందు ఎన్ని ఇచ్చినవు, డబుల్ బెడ్ రూమ్ పథకం క్రింద ఎన్ని ఇండ్లు కట్టిచ్చినవు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టియ్యలేని అసమర్థ ప్రభుత్వం నేడు ఎన్నికల వేళ గృహ లక్ష్మి పథకం అని షరతుల తో కూడిన పథకాలు పెట్టి బహుజన సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఫామ్ హౌస్, కోళ్ళ ఫారాలు కట్టుకొని స్థానికేతరుడివైన నీవు అభివృద్ధి చెందినవు అంతే తప్ప మానకొండూర్ ప్రజలకు నువ్వు చేసింది ఏమీ లేదు ఖబడ్దార్ రసమయి బాలకిషన్ అభినవ అంబేడ్కర్ అని చెప్పుకొనే అర్హత కూడా నీకు లేదు నీ చెంచలతో అల పిలిపించుకొని నీలి కండువా ముసుగులో మరోసారి మానకొండూర్ ప్రజలను మోసం చేస్తూన్న ఎమ్మెల్యే రసమయికి ఈసారి ప్రజలు తమ ఓటు తో బుద్ది చెప్తుతారు అని బహుజన సమాజం మేల్కొనే దిశగా బీఎస్పీ అడుగులు వేస్తుందని తెలిపారు.
సమావేశంలో పాల్గొన్నవారు జిల్లా కార్యవర్గ సభ్యులు& మానకొండూర్ ఇంచార్జి ఎగోళపు వెంకన్న గౌడ్, జిల్లా ఈసీ మెంబర్ పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కార్మిక విభాగం కో కన్వీనర్ కన్నం లక్ష్మణ్, అసెంబ్లీ బిట్ సెల్ కన్వీనర్ ఉప్పులేటి శ్రీనివాస్, బెజ్జంకి మండల ఉపాధ్యక్షలు కాంపెల్లి నరేష్, ప్రధాన కార్యదర్శి లింగాల శ్రీనివాస్, కార్యదర్శి సావన్నపెల్లి రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.