- నిన్న ఇబ్రహీంపూర్ శివారులో కారు బోల్తా ఘటన విషయంలో ఆర్ అండ్ బి అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
- ఉదయమే పనులు ప్రారంభించిన అధికారులు.
- హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు.
మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామ శివారులో గల కల్వర్టు వద్ద గత సంవత్సరం కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్డు ధ్వంసం అయిన విషయం మనందరికీ తెలిసిందే. చాలా రోజుల నుండి ఇదే కలవర్టు దగ్గర రోడ్డు ధ్వంసమై ఇబ్రహీంపూర్ పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం తగ్గినా ఇంకా రోడ్డు పనులు ప్రారంభం అవ్వకపోవడంతో ఇదే విషయం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు దృష్టికి తీసుకెళ్లిన గ్రామ ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన రోడ్డు పనులు మొదలు పెట్టాలని నిన్న ఆదేశించారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆదేశాల మేరకు రోడ్డు పనులు ప్రారంభించినట్లు ప్రజలు తెలిపారు.