విజయనగర, బొబ్బిలి : బొబ్బిలి పట్టణం BUDA చైర్మన్ గా తెంటు లక్ష్ము నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్ము నాయుడు మాట్లాడుతూ, “బొబ్బిలి పట్టణాన్ని అభివృద్ధి పరచడం, ప్రజలకు మౌలిక సదుపాయాలను అందించడం నాకు ప్రాధాన్యంగా ఉంటుంది. ఈ బాధ్యతను న్యాయంగా నిర్వర్తిస్తూ, ప్రజల కోసం అంకితభావంతో పని చేస్తాను” అని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు, విజయనగరం పార్లమెంటరీ ఇంచార్జ్ కిమిడి నాగార్జున, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామ్ మల్లిక్ నాయుడు, పతివాడ అప్పలనాయుడు, విజయనగరం కార్పొరేటర్ కర్రోతు నర్సింగరావు, బొబ్బిలి నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి, బొబ్బిలి నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ మరిశర్ల రామారావు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.