స్టాంప్ డ్యూటీపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే అప్పజెప్పనున్నట్లు కేంద్రం ప్రకటించింది. స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వీలు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. అదేసమయంలో మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఇక ఎన్‌పీఎస్ పథకంలో మార్పులు చేస్తూ మైనర్లు కూడా చేరేందుకు వీలు కల్పించారు. గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లను కేంద్రం ఈ బడ్జెట్ లో కేటాయించింది. ముద్ర రుణాల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో వెల్లడించారు.