అల్లూరి జిల్లా,మారేడుమిల్లి (ది రిపోర్టర్ టీవీ న్యూస్): మారేడుమిల్లిలో గిరిజనులకు నిలువ నీడ కరువవుతోంది. ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ రోడ్లపైనే ప్రజలు బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. స్థానిక ప్రధాన కూడలిలో బస్సు షెల్టరే లేకపోవటం శోచనీయం. ఉన్నచోట నిర్వహణ లోపంతో అద్వాన్నంగా మారి శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్నిచోట్ల కబ్జాకు గురైయ్యాయి. మరికొన్న చోట్ల బస్ స్టాప్ లో బస్సులు ఆపక రోడ్లపై పరుగులు తీయాల్సి వస్తోందని, ఈ ప్రాంతంలో తలదాచుకునే పరిస్థితులు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.