పిఠాపురం : భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బొడే రామచంద్ర యాదవ్ తిరుమల పరిరక్షణ లడ్డు ప్రసాదాలకు ఉపయోగించే నెయ్యి పై జరిగిన ప్రచారాలు తెర దించుతూ తన వంతుగా ఉచితంగా 1000 గోవులు ప్రకటించారు. లక్ష గోవులును ఉచితంగా సమకూర్చే భాద్యత తీసుకుంటానని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధమైన వనరులు ఉన్న టిటిడి దిశగా ఆలోచించకపోవడం శోచనీయమన్నారు. ప్రపంచంవ్యాప్తంగా ఉన్న కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి భక్తుల మనోభవాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యకు శాస్వత పరిస్కారం చేసే విధంగా భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బొడే రామచంద్ర యాదవ్ చూపిన చొరవ అభినందనీయమని, కానీ ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున వైఖరిని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నామన్నారు. తక్షణమే రామచంద్ర యాదవ్ చూచించిన సూచనలను పరిగణనలోకి తీసుకుని తీసుకుని టిటిడికి నెయ్యి కోసం శాశ్వత పరిస్కారం చేస్తారని, ఈ కూటమి ప్రభుత్వాన్ని అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కోరుకుంటున్నామని పిఠాపురం నియోజకవర్గ భారత చైతన్య యువజన పార్టీ ఇన్చార్జి శీరం శ్రీను పత్రికా ప్రకటనలో తెలిపారు.