నర్సీపట్నం అర్బన్: మూడు రాజధానులకు మద్దతుగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది.ఎమ్మెల్యే నడుపుతున్న బైక్‌ను పక్కనే ఉన్న మరో బైక్ అనుకోకుండా ఢీకొట్టడంతో ఎమ్మెల్యే కింద పడిపోయారు. ఆయన కాలికి తీవ్రగాయమైంది. హుటాహుటిన ఎమ్మెల్యేని నర్సీపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే కాలికి శస్త్రచికిత్స అవసరమని అక్కడి వైద్యులు చెప్పినట్లు సమాచారం.
