కరీంనగర్ జిల్లా: కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ రూ. 224 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జి నెల రోజులు గడవడంతో రోడ్లు, గోడలు బీటలు పడడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి స్పష్టం అవుతుందని శుక్రవారం సాయంత్రం బిజెపి మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ గడ్డం నాగరాజ్ అన్నారు.కోట్లు వెచ్చించి అంగు ఆర్భాటాలతో కేటీఆర్ తో ప్రారంభించారు. బినామీలకు కాంట్రాక్టులు అందించి కోట్లలో కమిషన్లు తీసుకుని ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆయన మండిపడ్డారు. నాణ్యతలేని రోడ్లను నిర్మించడం అసమర్థత కాంట్రాక్టర్లకు అప్పగించడం కాంట్రాక్టర్ల లైసెన్స్ లను తొలగించాలని అతనిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.