సాధారణంగా ఎవరికైతే నష్టం జరిగిందో, ఎవరి ఆస్తికి నష్టం కలిగిందో, ఎవరి హక్కులు భంగమయ్యాయో వారే కేసు పెట్టాలి. ఎవరికో ఎక్కడో అన్యాయం జరిగితే ఎవరో కేసు పెట్టడానికి లేదు. కాని ఇపుడు పద్ధతి మారింది. ఎవరికైనా ఎక్కడై నా అన్యాయం జరిగితే వారి తరఫున మీరు కేసు పెట్టవచ్చు. ఆన్యాయం జరిగింది పేదలకు కావడం వల్ల, వారు న్యాయవాదిని పెట్టుకొని కేసు కొట్లాడలేరు కాబట్టి వారి తరఫున ఎవరైనా కేసు దాఖలు చేయవచ్చు. ఎవరైనా వ్యక్తి లేదా సంఘం, సంస్థ ఈ విధంగా కేసు పెట్టవచ్చు. అలాగే ఒక వ్యక్తి తరపున కేసు పెట్టవచ్చు, లేదా కొందరు ప్రజల తరపున లేదా సంస్థ తరఫున కేసు పెట్టవచ్చు. ‘నీకేమి సంబంధం ? అసలు వాళ్ళు లేరే అని కేసు కొట్టిపారేయడానికి వీల్లేదు. అటువంటి కేసులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అంటున్నది సుప్రీంకోర్టు .ఇటీవల ఇటువంటి కేసులు ఎక్కువగా పడు తున్నాయి. దీని వలన పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతున్నది.
