ఈరోజు కన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్(CAPCO) మరియు నవ్యాంధ్ర కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజషన్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం కార్యక్రమం లో భాగంగా పిడుగురాళ్ల ఐ లాండ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేసుకుంటూ పోరాడుదాం పోరాడుదాం వినియోగదారుల హక్కుల పరిరక్షణ కై, చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు కల్తీలు నివారణకై, ప్రభుత్వాలు అరికట్టాలి రేషన్ మాఫీయాని, ధరలు తగ్గించాలి ప్రభుత్వంలు, వినియోగదారులను మోసం చేస్తున్నా వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని అని ప్రజా సంఘాల నాయకులు మరియు సామాజిక వేత్తలు నినాదాలు చేసుకుంటూ వచ్చి డిప్యూటీ తహసిల్దార్ ఎల్. ధనలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ బిజెపి అధ్యక్షులు కట్టమూరి ఉమామహేశ్వరరావు(ఈసా ) అంబేద్కర్ ప్రచార సేవా సమితి అధ్యక్షులు డేగల అబ్రహం, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బాబు, మరియు నాగేశ్వరరావు, ఆర్టిఐ అండ్ కన్జ్యూమర్ యాక్టివిస్ట్ కే కుమార్ మాట్లాడుతూ ప్రపంచానికి వినియోగదారుడే రారాజు మన దైనందిన జీవితంలో ప్రజలు గుండు సూది మొదలుకొని బిల్డింగ్ వరకు కొనుగోలు చేస్తుంటారు వ్యాపారులు నాణ్యతలేని వస్తువులను ప్రజలకి అధిక ధరలకు అమ్మి మోసం చేస్తున్నారు లాభపేక్షతో త్రాగే నీరుని తినే ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారులు చలగాట మాడుతున్నారు ఈ విషయాల పట్ల ప్రభుత్వం స్పందించి వారిపై చర్యలు తీసుకొని వినియోగదారుల హక్కుల పరిరక్షణకు భంగం కలగకుండా న్యాయం జరిగేలా చూడమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు రామ ఇశ్రాయేలు, పట్టణ బిజెపి మహిళా అధ్యక్షురాలు రమాదేవి, భారతీయ బహుజన పార్టీ నాయకులు లాజరు, సాగర్, సురేంద్ర, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు లాజరు,సుశీల తదితరులు పాల్గొన్నారు