భారత్ జోడో పేరిట పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. పాదయాత్రలో కేజీఎఫ్-2 పాటలను వినియోగిస్తున్నారంటూ రాహుల్ గాంధీ తదితరులపై కేసు నమోదైంది.
కేజీఎఫ్-2 పాటలపై హక్కులను కలిగివున్న బెంగళూరుకు చెందిన ఎమ్మార్టీ మ్యూజిక్ అనే మ్యూజిక్ ప్లాట్ ఫాం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, సుప్రియా శ్రీనటే కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఎమ్మార్టీ మ్యూజిక్ పేర్కొంది.
కేజీఎఫ్-2 హిందీ వెర్షన్ పాటలపై హక్కులను సొంతం చేసుకునేందుకు తాము భారీ మొత్తంలో చెల్లించామని, అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అనుమతిలేకుండా ఈ పాటలను వాడుకుంటున్నారని, తమ పాటల బ్యాక్ గ్రౌండ్ తో వీడియోలు రూపొందిస్తున్నారని ఎమ్మార్టీ మ్యూజిక్ ఆరోపించింది. ఎమ్మార్టీ మ్యూజిక్ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.