కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దేశవ్యాప్తంగా 91 యూనివర్సిటీల్లో సోదాలు నిర్వహించింది. నకిలీ విదేశీ వైద్య సర్టిఫికెట్ల కేసులో ఈ సోదాలు చేపట్టింది.
కేంద్రం నిర్వహించే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షలో 73 మంది ఫెయిలయ్యారు. అయితే, స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో నకిలీ రిజిస్ట్రేషన్ నెంబర్లు పొందుపరిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఫిర్యాదు నేపథ్యంలో, ఈ నెల 21న సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తులను, ఏపీకి చెందిన ఇద్దరిని ఎఫ్ఐఆర్ లో చేర్చింది.
దర్యాప్తులో భాగంగా, ఈ నెల 23న సీబీఐ విజయవాడలోని ఏపీ మెడికల్ కౌన్సిల్ లోనూ తనిఖీలు జరిపింది. విదేశాల్లో వైద్య విద్య పూర్తిచేసిన విద్యార్థుల వివరాలు సేకరించింది. 2011 నుంచి నమోదైన వివరాలను సీబీఐ సేకరించించింది. రిజిస్టర్లు, కంప్యూటర్లలోని డేటాను స్వాధీనం చేసుకుంది.