- అగ్టస్టు 15 సాయంత్రం క్రాకర్ షో, సాంస్కృతిక, ఈట్ ఫుడ్, స్టేజ్ ప్రోగ్రామ్ కార్యక్రమాలు
- కేబుల్ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ దారిమళ్లింపు
- ప్రజలందరూ పిల్ల పాపలతో ఆనందించేందుకు ప్రతి శని, ఆదివారాల్లో వీకెండ్ మస్తి కార్యక్రమాల నిర్వహణ
- వికేండ్ మస్తి పోస్టర్ ఆవిష్కరణ
- రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ: కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణాలతో గొప్ప పర్యాటక ప్రాంత్రంగా అభివృద్ది చెందుతున్న కరీంనగర్ జిల్లాలోని ప్రజలకు ఆనందం, ఆహ్లాదం అందించే విధంగా అగస్టు 15 సాయంత్రం సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.ఆదివారం సాయంత్రం ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కేబుల్ బ్రిడ్జిపై నిర్వహించనున్న వీకెండ్ మస్తి సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గోప్ప పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న కరీంనగర్ జిల్లాలో, అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యద్భుతంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వేదికగా జిల్లా ప్రజలను ఆకర్షీతులను చేస్తూ ఆకట్టుకునేలా అగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాటి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 1.00 ఒంటిగంట వరకు సాంస్కృతిక కార్యక్రమాలు,స్ట్రీట్ ఫుడ్, క్రాకర్ షో లతో పాటు పిల్లలను ఆకర్షించే కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కోన్నారు. కరీంనగర్ జిల్లాను అన్ని రంగాలతో పాటు, 24 టియంసీల వాటర్ బాడీ కలిగిన మానేరు నది ప్రాంతాన్ని గోప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేయడంతో పాటు, ప్రజలకు ఆనందాన్ని పంచేలా మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి మంజూరు చేశారన్నారు. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి పనులు పూర్తిచేసుకోగా రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు గారి చేతుల మీదుగా అంగరంగవైభవంగా ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. రివర్ ఫ్రంట్ పనులు పురోగతిలో ఉన్నాయని, రాబోయె సెప్టెంబర్ చివరి నాటికి మానేరు రివర్ ఫ్రంట్ లో గేట్లను ఏర్పాటు చేసి నీళ్ళను ఆపుకోవడం జరుగుతుందని అన్నారు. డైనమిక్ లైటింగ్ సిస్టం, ఎల్ఈడి స్కిన్ ల ఏర్పాటుతో కేబుల్ బ్రిడ్జి వద్ద ప్రజలు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పెద్దసంఖ్యలో చేరుకొని కేబుల్ బ్రిడ్జి అందాలను వీక్షిస్తున్నారన్నారని, ప్రజలకు అభివృద్దితో పాటు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచేలా “వికేండ్ మస్తి” కార్యక్రమాలను జరుపనున్నామని, దీనిని అగస్టు 15 సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి శని ఆదివారాల్లో వీకెండ్ మస్తీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వీకెండ్ మస్తీలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు స్ట్రీట్ ఫుడ్ అనే పేరుతో ఫుడ్ స్టాళ్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, క్రాకర్ షో, పిల్లలకు సంతోషాన్నిచే ప్లె గేమ్స్ ను ఏర్పాటు చేసేలా ఈవెంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని ప్రజలందరు అగస్టు 15 న కేబుల్ బ్రిడ్జి పై జరిగే కార్యక్రమాన్నికి హజరుకావాల్సిందిగా జిల్లా ప్రజలకు మంత్రి ఆహ్వానాన్ని పలికారు. ఈ కార్యక్రమాలను వీక్షించడానికి కేబుల్ బ్రిడ్జి వద్దకు వచ్చే సందర్శకులకు వాహనాల రాకపోకలతో ఇబ్బందులు తలెత్తకుండా ఇకపై ప్రతి శని ఆదివారాల్లో సాయత్రం 6 గంటల తరువాత భారీ వాహనాలను రాకపోకలు జరగకుండా దారిమల్లించడం జరుగుతుందని తెలిపారు. . ఇకపై ప్రతి శని, ఆదివారాల్లో కూడా ప్రజలకు ఆనందాన్ని కలిగించే కార్యక్రమాలను నిర్వహించేలా ప్రణాళికను రూపొందించుకొడం జరుగుతుందని తెలిపారు.
కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ దేశంలో మొదటి స్థానాల్లో నిలువనున్నాయని, మానేరు రివర్ ఫ్రంట్ పనులు ఇప్పటికే 25 శాతం పనులు పూర్తవగా, మిగిలిన పనులను వేగవంతంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికే అద్బుతమైన రోడ్లు, ఐలాండ్ ల నిర్మాణాలతో కరీంనగర్ జిల్లా గోప్ప నగరంగా అభివృద్ది చెందిందని, రివర్ ఫ్రంట్ పనులు పూర్తయి జిల్లా ఆస్తిగా నిలువనుందని తెలిపారు. వికేండ్ మస్తి పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మేయర్ వై. సునీల్ రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్,కరీంనగర్ ఆర్డిఓ కె. మహేష్,కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, జడ్పిటిసి, ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గోన్నారు.