టీడీపీ అధినేత చంద్రబాబును కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కలిశారు. ఆయనతో పాటు జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్, జాయింట్ సెక్రటరీ శివప్రకాశ్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మధుకర్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో వీరు సమావేశమయ్యారు. టీడీపీ, బీజేపీ, జనసేనల ఉమ్మడి కార్యాచరణపై వీరు చర్చిస్తున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపత్యంలో మోదీ రాష్ట్ర పర్యటన, బహిరంగ సభల గురించి చర్చిస్తున్నారు.