- నేర నియంత్రణ, భద్రతా లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయి.
ఈ రోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిది కమ్యూనిటీ పోలీసింగ్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని సెక్టార్-1 ప్రాంతంలో రూ.2,65,000/- విలువైన 30 CCTV కెమెరాలను రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి, మంచిర్యాల డీసీపీ సుదీర్ రాంనాథ్ కేకన్, ఏసీపీ తిరుపతి రెడ్డి ఇతర పొలిసు అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నేరాలు నియంత్రణ, స్వీయ భద్రత కు సీసీ కెమెరాలు బాగా తోడ్పాటునిస్తాయని తెలిపారు. సీసీ కెమెరాలు ఉండడం వల్ల నేరం చేయడానికి నేరస్తులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారని తెలిపారు. ఎక్కడ నేరం చేసిన సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తుపట్టవచ్చని అన్నారు. ప్రజలు ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు, సహాయ సహకారాలతో నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలు దాతల సాహాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజల రక్షణ భద్రత గురించి పోలీసులు ఎల్లవేళలా పనిచేయడం జరుగుతుందన్నారు. సీసీ కెమెరాలు ఉంటే గ్రామంలలో, కాలనీ లలో ప్రజలకు రక్షణగా సెక్యూరిటీగా 24X7 పనిచేస్తాయని తెలిపారు. ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించడానికి సిసి కెమెరాలను ఎంతోగానో ఉపయోగపడతాయన్నారు.నిందితులు ఏదైనా నేరం చేసినప్పుడు సీసీ కెమెరాల పుటేజ్ వల్ల కోర్టులో నిందితులకు తప్పకుండా శిక్ష పడుతుందని తెలిపినారు. సున్నితమైన ప్రాంతాల్లో నిఘా సిసి కెమరాలు ఎంతో కీలక ప్రాత వహిస్తాయని, సీసీ కెమెరాలు 24 గంటలు 365 రోజులు నిర్విరామంగా నిరంతరాయంగా సీసీ కెమెరాలు పనిచేస్తాయని తెలిపినారు. సీసీ కెమెరాలవల్ల నేరాలు జరుగాకుండ నియత్రించవచ్చని అంతేకాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండడానికి కుడా ఉపకరిస్తాయన్నారు. ప్రజల, పోలీసుల సమన్వయంతోనే నేరాలు నియంత్రణ సాధ్యపడుతుందని సీపీ తెలిపినారు.
సెక్టార్ -1 తిలక్ నగర్, హమాలీ వాడ లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించిన వారిని ఆదర్శంగా తీసుకొని మిగతా ప్రాంతాలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, 30 సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చి పోలీస్ వారికి సహకరించిన వారిని, సెక్టార్ ఎస్ఐ రాజేందర్ ఈ సందర్భంగా సీపీ అభినందించారు.