సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండల కేంద్రంలో కొన్ని ప్రాంతాల్లో సిసి రోడ్లు లేకుండా ఉండడంతో ప్రజలు వర్షాకాలంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడంతో మట్టి రోడ్డుపై సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతూ బెజ్జంకి గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రణీత్ రెడ్డికి బెజ్జంకి మండల పట్టణ శాఖ అధ్యక్షుడు సంఘ రవి గురువారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ధోనె అశోక్ మాట్లాడుతూ గ్రామంలో అసంపూర్తిగా మిగిలిపోయిన లోతట్టు ప్రాంతాల్లో రోడ్డు దాటకుండా ఉన్న నీరు వెళ్ళుటకు సులువుగా పైపులైన్లను వేసి వాటి పైన సీసీ రోడ్డు వేయాలని, గ్రామ పంచాయతీకి చెందిన బోరు బావి చుట్టూ సీసీ తో నింపి నీరు బయటకు డ్రైనేజీల్లో కి వెళ్ళుటకు వీలుగా ఒక పైపులైన్ అమర్చి ప్రజలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి దొంతర వేణి శ్రీనివాస్ యాదవ్, మండల కార్యదర్శి వడ్లూరి శ్రీనివాస్, పార్టీ నాయకులు శీలం వెంకటేశం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.