కరీంనగర్ జిల్లా: మానకొండూర్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్ ఆధ్వర్యంలో భారతీయ జన్ సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ 122 వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ బిజెపి మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి గడ్డం నాగరాజు మాట్లాడుతూ. ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్, నహీ చలేంగే” అనే నినాదాన్ని అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పాని తిరుపతి, సీనియర్ నాయకులు కొత్తిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాచర్ల కోటేశ్వర్, మండల ఉపాధ్యక్షులు కత్తి ప్రభాకర్ గౌడ్, బీజేవైఎం మండల అధ్యక్షులు బాషబోయిన ప్రదీప్ యాదవ్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మార్కొండ రమేష్ పటేల్, ఉపాధ్యక్షులు కొండ్ర వరప్రసాద్,8వ పోలింగ్ బూత్ అధ్యక్షులు నందగిరి బలరాం, ముంజంపల్లి పోలింగ్ బూత్ అధ్యక్షులు పిట్టల నరేష్, ఎడేల్లి సంపత్, సంతు తదితరులు పాల్గొన్నారు.