వరల్డ్ స్టాండర్స్ డే సందర్భంగా భారతీయ ప్రామాణికుల సంస్థ (BIS)ద్వారా సర్టిఫికెట్ స్వీకరించిన శ్రీ చక్ర సిమెంట్ యాజమాన్య ప్రతినిధులు శ్రీ చక్ర సిమెంట్ కర్మాగార ప్రతినిధి వి రాజేంద్రప్రసాద్. వి వి రవికుమార్. డిజిఎం వర్క్స్
తమ సంస్థకి ఇంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిన ప్రతి ఒక్కశ్రీ చక్ర సిమెంట్ వినియోగదారులకు..పంపిణీ దారులకు (డీలర్స్) కి మరియు ఎంప్లాయిస్ కి యాజమాన్యానికి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కర్మాగార ప్రతినిధి వి రాజేంద్రప్రసాద్. మరియు పి బాలమురళీకృష్ణ. అసిస్టెంట్ జనరల్ మేనేజర్.
పల్నాడు జిల్లా కారంపూడి పట్టణ శివారులో గత 40 సంవత్సరాలుగా సిమెంట్ రంగంలో దేనిలోను రాజి పడకుండా తమ వినియోగదారులకి మంచి క్వాలిటీ ఉత్పాదన కలిగిన సిమెంట్ అందిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచిన శ్రీ చక్ర సిమెంట్ యాజమాన్యానికి సిమెంటు ఉత్పాదనకి వరల్డ్ స్టాండర్స్ డే సందర్భంగా భారతీయ ప్రామాణిక సంస్థ (BIS) ద్వారా బెస్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ అందించారు ఈ సందర్భంగా కర్మగార ప్రతినిధి వి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తమ సంస్థను ఎన్నో సంవత్సరాలుగా ఆదరిస్తూ వస్తున్న కస్టమర్లకి వినియోగదారులకు అలాగే పంపిణీదారులకు తాము రుణపడి ఉంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు మేము ఇంత క్వాలిటీ అందిస్తున్నామంటే దాని వెనక యాజమాన్య నిరంతర శ్రమ ఉద్యోగస్తుల కటోర శ్రమఉందని.రానున్న రోజుల్లో కూడా మంచి క్వాలిటీ(నాణ్యత) అందించడంలో రాజీ పడబోమని ప్రతి ఒక్క కస్టమర్ కి వినియోదారుడికి పంపిణీదారులకు తాము జవాబుదారీగా ఉంటామని ఎప్పటికి కూడా శ్రీ చక్ర సిమెంటు క్వాలిటీ (నాణ్యత) విషయంలో ఎక్కడ కూడా రాజీ పడ బోమని ఎన్నో సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రజలకి వినియోగదారులకు అలాగే పంపిణీదారులకు ఈ సందర్భంగా మా సంస్థ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కర్మాగార ప్రతినిధి వి రాజేంద్రప్రసాద్. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పి బాలమురళీకృష్ణ . మరియు బిఎస్ లింగమూర్తి సీఎస్ఓ. తదితరులు పాల్గొన్నారు.