తిరుపతి: జ్యోతిష్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబరి.., రాష్ట్ర నంది అవార్డుతో పాటు మరెన్నో అవార్డులను తన సొంతం చేసుకున్న ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ చక్రధర్ సిద్దాంతిని దైవజ్ఞ రత్న అవార్డు వరించింది. ఆదివారం విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ వైదిక జ్యోతిష్య సమ్మేళనంలో హైదరాబాద్ కు చెందిన
విశ్వజ్యోతి జ్యోతిష్య విజ్ఞాన సంస్థ వారు.., దైవజ్ఞ రత్న అవార్డును ,తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు చేతుల మీదుగా.., సరస్వతి పుత్రుడు డాక్టర్ చక్రధర్కు ప్రదానం చేయించి గౌరవించారు.ఆయన ప్రతిభను కొనియాడారు.జ్యోతిష్య శాస్త్రం గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేయాలని సూచించారు.దైవజ్ఞ రత్న అవార్డును అందుకున్న డాక్టర్ చక్రధర్ సిద్దాంతి ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డును అందుకోవడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. భవిష్యత్తును తెలియజేసే జ్యోతిష్య శాస్త్ర విలులను బావితరాలకు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు డాక్టర్ చక్రధర్ సిద్దాంతి. ఈ సమ్మేళనా కార్యక్రమంలో విశ్వజ్యోతి జ్యోతిష్య విజ్ఞాన సంస్థ అధినేత విశ్వనాథ్ , కంచికామకోటి ఆస్ధాన పండితులు లక్కావజ్జుల విజయ సుబ్రహ్మణ్యం సిద్దాంతి,ఇతర జ్యోతిష్య పండితులు పాల్గొన్నారు.