తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గాదంకి,శంఖంపల్లి,నేండ్రగుంట పంచాయతీల మహిళలతో ముఖా ముఖి కార్యక్రమం టిడిపి మహిళా నేత పులివర్తి సుధా రెడ్డి,స్థానిక మహిళ నాయకురాళ్ళు సమక్షంలో శుక్రవారం నిర్వహించారు.ముందుగా పులివర్తి సుధా రెడ్డికి మహిళలు,స్థానికులు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు.అనంతరం నేతలు శ్యాలువా కప్పి సన్మానించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు మాసాలలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించారు.చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సొంత మండలం,పాకాల మండలంలో జరిగిన జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేశారు.పంచాయతీల లోని సమస్యలను మహిళలను అడిగి తెలుసుకొని,తక్షణమే పరిష్కారమించే దిశగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
యుద్ధ ప్రాతిపదికన పరిష్కారమయ్యే సమస్యలను ఎమ్మెల్యే పులివర్తి నాని,అధికారులు దృష్టికి తీసుకెళ్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.మహిళలకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు తీసుకొస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు,మహిళలు,స్థానిక ప్రజలు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.