తిరుపతి / చంద్రగిరి : గ్రామాలలోని యువత వారి భవిష్యత్తు కోసం పట్టణానికి వలస వెళ్లడంతో గ్రామాలలోని వృద్ధులు నిరాశ్రయులుగా మిగిలిపోతున్నారు. వారికోసం అదే గ్రామానికి చెందిన సిద్దరామిరెడ్డి వారి కుటుంబ సభ్యులు వెంకటరెడ్డి లు వృద్ధుల కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. వృద్ధాశ్రమ నిర్మాణానికి భూమిపూజ ఏర్పాటు చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథులుగా విచ్చేసి తన చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. ముందుగా చిన్నగొట్టిగల్లు మండలం, రంగన్నగారి గడ్డ పంచాయతీకి భూమి పూజ కొరకు ముఖ్య అతిథులుగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పుంగనూరు ఇంచార్జ్ చల్లా బాబు రెడ్డి, పీలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి, తిరుపతి ఇస్కాన్ టెంపుల్ ప్రెసిడెంట్ రేవతి రమణ దాస్, వృద్ధాశ్రమ ధాత సిద్ద రామిరెడ్డి వారి కుటుంబ సభ్యులు వెంకటరెడ్డి లు వృద్ధాశ్రమ పూజలో ముఖ్య అతిథులుగా విచ్చేసారు. ముందుగా పులివర్తి నానికి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ లక్ష్మీదేవి దర్శనం అనంతరం భూమి పూజలో పాల్గొన్నారు.
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా భూమి పూజ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ డబ్బులు అందురు సంపాదిస్తారు. సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం ఎంతో సంతోషించ దగ్గ విషయమని, పల్లెటూర్ల నుంచి పట్టణాలకు వలస వెళుతున్న ఈ రోజులలో కూడా ఊరు బాగుండాలి ఊరులోని జనాలు బాగుండాలి అనే ఆలోచనతో పిల్లల చదువుల కోసం వారి భవిష్యత్తు కోసం పట్టణానికి వెళ్లి స్థిరపడడంతో గ్రామాలలో నిరాశ్రయులుగా మిగిలిన వృద్ధుల కొరకు అన్ని వస్తువులతో కూడిన వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి గ్రామంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేయడం సంతోషించదగ్గ విషయం అంటూ పులివర్తి నాని
అన్నారు. ఇదేవిధంగా బయటకు వెళ్లి స్థిరపడిన వారు స్వచ్ఛందంగా గ్రామాల అభివృద్ధి కొరకు సహకరించాలని ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని నాని అన్నారు. సంపాదనలో ఎంతో కొంత భాగం గ్రామాలకు గ్రామ అభివృద్ధికి ఖర్చు పెడితే గ్రామ అభివృద్ధికి మీ వంతు సహాయం చేసిన వారు అవుతారని ప్రతి ఒక్కరు గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.