contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్ .. ముగ్గురు మహిళా నక్సలైట్లు హతం

మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్, కంకేర్ జిల్లాల సరిహద్దుల్లో నక్సలైట్లు, భద్రతా బలగాల మధ్య ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు మహిళా నక్సలైట్లు హతమయ్యారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో మృతదేహాలు, ఆయుధాలతో పాటు పలు రకాల వస్తువులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ విషయాన్ని పోలీసు అధికారులు వెల్లడించారు.

బీఎస్ఎఫ్, జిల్లా రిజర్వ్ గార్డ్స్, ఎస్టీఎఫ్ సిబ్బంది ఎన్ కౌంటర్ లో పాల్గొన్నారు. ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలు సురక్షితంగా ఉన్నాయి. ఉదయం నుంచి ఎన్ కౌంటర్ కొనసాగుతోందని… ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నారని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :