- గ్రామపంచాయతీని సందర్శించిన విద్యార్థులు
- రోజంతా ఆటపాటలు వివిధ కృత్యాలతో బోధన
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు రోజువారి పాఠశాల బోధన, పుస్తకాల మోతకు భిన్నంగా ఆటపాటలతో వారిలో సృజనాత్మకతను, ఆలోచనా శక్తిని పెంపొందించేందుకు “నో బ్యాగ్ డే” నిర్వహించారు, పిల్లల్లో బడి పట్ల భయాన్ని పోగొట్టి చదువు పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కట్టా రవీంద్ర చారి పేర్కొన్నారు.. “నో బ్యాగ్ డే” కార్యక్రమంలో భాగంగా 6,7 తరగతుల విద్యార్థులు గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. గ్రామపంచాయతీ వ్యవస్థ, ఉద్యోగుల పనితీరు, గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాలు, రికార్డుల వివరములు, ప్రభుత్వ పథకాలు తదితర విషయాలకు సంబంధించి గ్రామపంచాయతీ సిబ్బంది విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకటేష్, కారోబార్ మాధవరావు, సాయి, ప్రభాకర్ ఉపాధ్యాయులు ఎం బాలయ్య, డి శంకరయ్య, పిఇటి రాజబాబు తదితరులు పాల్గొన్నారు.