జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జిల్లాలోని మహాదేవపూర్ మండలం లో అక్రమంగా తరలిస్తున్న చిరుతపులి చర్మం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 6గురు నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసి నిందితుల వద్ద నుండి చిరుతపులి చర్మం, రెండు ద్విచక్రవాహనాలు, ఆరు మొబైల్ ఫోన్స్, రూ. 3000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పోలీస్,అటవీశాఖ పరమైన కేసులను నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ సురేందర్ రెడ్డి. తెలిపారు.
