ప్రపంచం లో అత్యంత వేగవంతమైన జంతువుల్లో చీతా (చిరుతల్లో ఒకరకం) ఒకటి. అలాంటి వాటికి కుక్కలు రక్షణగా నిలువబోతున్నాయి. చిరుతకు కుక్కలు రక్షణ ఇవ్వడం ఏంటని అనిపిస్తున్నా ఇది నిజం. నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చి మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ పార్కులో ఉంచిన చీతాలకు కుక్కలతో రక్షణ వలయం ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం హర్యానా పంచకులలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీటీ) నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్‌లో జర్మన్ షెపర్డ్‌లు శిక్షణ పొందుతున్నాయి. శిక్షణ తరువాత ఇవి కునో నేషనల్ పార్కులో చీతాల డాగ్ స్క్వాడ్ లో చేరుతాయి. ఇవి ప్రమాదాన్ని పసిగట్టి చిరుతలకు కొత్త వాతావరణంలో రక్షణ కల్పిస్తాయి.
ప్రత్యేక శిక్షణా కోర్సులో పులి చర్మం, ఎముకలు, ఏనుగు దంతాలు, ఎర్ర సాండర్లు, ఇతర అక్రమ వన్యప్రాణుల ఉత్పత్తులను గుర్తించడానికి కూడా వాటికి శిక్షణ ఇస్తారు. ఈ కుక్కలకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్-ఇండియా (వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా) సహకారంతో శిక్షణ ఇస్తున్నట్టు ఐటీబీపీ బేసిక్ ట్రైనింగ్ సెంటర్ ఐజీ ఈశ్వర్ సింగ్ దుహన్ తెలిపారు. వివిధ నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడేలా ఏడు నెలల శిక్షణ ఉంటుందన్నారు. నేషనల్ పార్కులో చిరుతలు, ఇతర జంతువులను వేటగాళ్ల నుంచి రక్షించడానికి ఈ కుక్కలు వచ్చే ఏప్రిల్‌లో విధుల్లో చేరుతాయని తెలిపారు.
కాగా, 1947లో మహారాజా రామానుజ్ ప్రతాప్ సింగ్ డియో జాతికి చెందిన చివరి చీతాను కాల్చి చంపిన తర్వాత 1952లో భారత్ లో ఈ రకం చిరుతలు అంతరించిపోయినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో, ఖండాంతర స్థాన భ్రంశం ప్రాజెక్ట్‌లో భాగంగా నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలను తన పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కునో జాతీయ పార్కులోకి విడుదల చేశారు.
One German Shepherd Dog will guard PM's 8 Cheetas in MP
Ilu is getting training under #ITBP's training centre in Panchkula, Haryana
I report @TheNewIndian_in with @amitrawat31120
Text story : https://t.co/xOnlgbYvs5 pic.twitter.com/ndbFFSlu7y
— Alok Arjun Singh (@AlokReporter) September 27, 2022