మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని చేగుంట గ్రామంలో ఉన్న ఎన్జీఓ కాలనీ రోడ్డును అక్రమంగా ఆక్రమించి, అక్కడ పైగా మోరి నిర్మాణం చేస్తున్న వ్యాపారవేత్తపై కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ జి ఓ కాలనీవాసులకు సంబంధించిన రోడ్డును ఒక వ్యాపారవేత్త, స్థానిక నాయకుల అండదండలతో ఆక్రమించి, కాలనీవాసుల వాహన రాకపోకలకు ఇబ్బందులకు కలిగిస్తున్నాడని తెలిపారు.
ఈ విషయం పై, కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. పట్టణ పంచాయతీ కార్యాలయం (ఈవో) నరేష్ ఈ మేరకు స్పందిస్తూ, “గతంలో పంచాయతీ ఈవోగా పనిచేసిన అధికారితో అనుమతిని ఇచ్చిన నిర్మాణమే ఇది. నేను కొత్తగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఈ సమస్యను చూసాను. మీరు చేసిన పిర్యాదుపై తగిన చర్యలు తీసుకుంటానని అన్నారు.