మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో తహసిల్దార్ జ్ఞాన జ్యోతి పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వచ్ఛతనం పచ్చదనం మేరకు మొక్కలు నాటారు. పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని తెలిపారు.